పారిస్ లో మోడీకి ఘన స్వాగతం
- August 22, 2019
పారిస్:ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,నాయకులు ఘనస్వాగతం పలికారు. భారత సంతతి ప్రజలకు మోడీకి ఘన స్వాగతం పలికారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్,ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎడోర్డ్ ఫిలిప్పీతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. యూఏఈ,బహ్రెయిన్ లో కూడా మోడీ పర్యటించనున్నారు. ఆయా దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..