మోడీ పర్యటన: బహ్రెయిన్‌ - భారత్‌ మధ్య మరింత మెరుగైన ఆర్థిక బంధం

మోడీ పర్యటన: బహ్రెయిన్‌ - భారత్‌ మధ్య మరింత మెరుగైన ఆర్థిక బంధం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బహ్రెయిన్‌లో పర్యటించడం ద్వారా ఇరుదేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలోపేతమవుతుందని కింగ్‌డమ్‌లో ప్రముఖ ఇన్వెస్టర్స్‌లో ఒకరైన వ్యాపారవేత్త వర్గీస్‌ కురియన్‌ చెప్పారు. వికెఎల్‌ హోల్డింగ్స్‌ మరియు నమాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ అయిన కురియన్‌ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళుగా బహ్రెయిన్‌ - భారత్‌ మధ్య ఆర్థిక బంధం కొనసాగుతోందని చెప్పారు. 2018-19లో ఇరుదేశాల మధ్య ట్రేడింగ్‌ 1.282 బిలియన్‌ డాలర్లకు చేరుకుందనీ, అంతకు ముందుతో పోల్చితే ఇది 30 శాతం ఎక్కువని చెప్పారాయన. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు దూసుకెళుతోన్న భారత్‌, ఈ క్రమంలో బహ్రెయిన్‌ సహా స్నేహ దేశాలతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకుంటుందని వివరించారు కురియన్‌. 

 

Back to Top