యూఏఈ లో గవర్నమెంట్‌ ఉద్యోగులకు కుదించిన పనివేళలు

యూఏఈ లో గవర్నమెంట్‌ ఉద్యోగులకు కుదించిన పనివేళలు

స్కూలుకు వెళ్ళే చిన్నారులున్న ఫెడరల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌కి కొత్త అకడమిక్‌ టెర్మ్‌ తొలివారంలో మూడు గంటల మేర షార్ట్‌ వర్కింగ్‌ అవర్స్‌ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫెడలర్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ వెల్లడించింది. యూఏఈ క్యాబినెట్‌ గత ఏడాది ఆమోదించిన విధానానికి సంబంధించి ఈ కొత్త వెసులుబాటు అమల్లోకి వచ్చింది. పేరెంట్‌ - టీచర్‌ మీటింగ్స్‌కి హాజరయ్యేందుకు ఉద్యోగులు పర్మిషన్‌ కోసం రిక్వస్ట్‌ చేయడానికీ ఈ విధానం అనుమతిస్తుంది. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ హ్యాపీనెస్‌ అండ్‌ పాజిటివిటీ - ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌తో కలిసి రూపొందించిన రికమండేషన్స్‌ ఆధారంగా క్యాబినెట్‌ ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపిన విషయం విదితమే. 

 

Back to Top