పాకిస్థాన్ పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
- August 28, 2019
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ లో హింస ఉందనే విషయం నిజమేనని. అయితే, దీనికి పాకిస్థానే కారణమని అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని చెప్పారు. ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులకు పాక్ మద్దతు ఇస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో విషయాలలో పాకిస్థాన్ ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని చెప్పారు. పాకిస్థాన్ కు ఒక్క విషయాన్ని తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తెలిపారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావు లేదని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







