మెంతుల వల్ల కలిగే లాభాలు...

- August 28, 2019 , by Maagulf
మెంతుల వల్ల కలిగే లాభాలు...

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. 
 
మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. 
 
గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
 
ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది.
 
మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే కచ్చితంగా కరిగిపోతుంది. ( నానబెట్టి మెంతులు+ మజ్జిగ రెండు కలిపి తాగాలి.)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com