వారణాసి పై పంజా విసిరేందుకు సన్నాహాలు చేస్తున్న లష్కరే!
- August 28, 2019
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో ఉగ్ర దాడులకు సరికొత్త టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసిలో భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేస్తున్న లష్కరే ఈ దిశగా ఇక్కడ ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం.వారణాసి కేంద్రంగా ఉగ్ర దాడులతో చెలరేగేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసి సందర్శించారని, ఈ ప్రాంతంలో బేస్‌ను ఏర్పాటు చేసేందుకు సైతం పరిశీలిస్తున్నారని నిఘా సంస్థలు అధికారులకు సమాచారం అందించాయి. వారణాసిలో విధ్వంసం సృష్టించేందుకు తగిన వెసులుబాటు కోసం మే 7 నుంచి మే 11 మధ్య లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని మరో నేపాల్‌కు చెందిన ఉగ్రవాదితో కలిసి ఇక్కడ మకాం వేసినట్టు నిఘా వర్గాలు ప్రస్తావించాయి. వారణాసి ప్రాంతంలో లష్కరేను ఎలా బలోపేతం చేయడంతో పాటు పవిత్ర వారణాసిలో భారీ ఉగ్రదాడికి వారు మేథోమథనం చేశారని నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







