యూఏఈలో కొనసాగనున్న ఫాగ్ కండిషన్స్
- August 28, 2019
ఆదివారం వరకూ యూఏఈలో ఫాగ్ కండిషన్స్ కొనసాగే అవకాశం వున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఎన్‌సిఎం వెల్లడించిన వివరాల ప్రకారం రాత్రి వేళల్లో, తెల్లవారు ఝామున హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుందనీ, కొన్ని ప్రాంతాల్లో ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ అధికంగా వుండొచ్చనీ తెలుస్తోంది. ఫాగ్ కండిషన్స్ కారణంగా విజిబిలిటీ గణనీయంగా తగ్గుతుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాల్సి వస్తుంది. వాతావరణం ప్రశాంతంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని ఎన్‌సిఎం తెలిపింది. ఇంటర్నల్ ఏరియాస్‌లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 46 డిగ్రీల వరకూ చేరుకోవచ్చు. గాలుల తీవ్రత సాధారణంగానే వుంటుంది. కోస్టల్ ఏరియాస్‌లో 70 నుంచి 90 శాతం వరకు, ఇంటీరియర్ రీజియన్స్‌లో 65 నుంచి 85 శాతం వరకు, మౌంటెయిన్స్‌లో 40 నుంచి 65 శాతం వరకు హ్యుమిడిటీ వుంటుంది. ఆదివారం వరకు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగవచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!