హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం ఆ మందు వాడారు.. చివరకు ఇలా అయ్యారు..

- August 29, 2019 , by Maagulf
హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం ఆ మందు వాడారు.. చివరకు ఇలా అయ్యారు..

హెయిర్ ఫాల్ కోసం రకరకాల మందులను వాడుతుంటారు. అయితే వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడితే భారీ ప్రమాదం ఉందనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. స్పెయిన్ లో కొందరు యువకులు హెయిర్ ఫాల్ ను నిర్మూలించుకోవడం కోసం ఏవో ఔషధాలను వాడారు.. దాంతో వారి ముఖాలు తోడేళ్ళలాగా వికారంగా తయారయ్యాయి. మందు కల్తీ అవడం వల్ల ఇలా జరిగిందని వైద్యనిపుణులు గుర్తించారు. దీనిని ‘వర్‌ఫూల్ఫ్‌ సిండ్రోమ్‌’ అని పిలుస్తారని, వైద్య పరిభాషలో ‘హైపర్‌ట్రికోసిస్‌’గా వ్యవహరిస్తారని వారు తెలిపారు.

హెయిర్ ఫాల్ కోసం తయారుచేసిన ఔషదం కలుషితం జరిగింది. దాంతో ఆ బ్యాచ్ కెమికల్ మొత్తం పాడైపోయింది. దీన్ని గమనించని కంపెనీ సిబ్బంది.. ఔషధాలను మార్కెట్ లోకి పంపించింది. దాంతో ఈ మందు వాడిన 16 మంది యువకులకు ముఖంమీద వికారంగా అవాంఛిత రోమాలు మొలిచాయి. వారి ముఖాలు అందవికారంగా తోడేలు ముఖాల వలె తయారయ్యాయని నిపుణులు గుర్తించారు. ఇందుకు కారణమైన స్పెయిన్ కు చెందిన ‘ఫార్మా క్వమికా’ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేశామని, ఆ బ్యాచ్‌ సరకును మొత్తం మార్కెట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని వైద్యాధికారులు చెప్పారు. భారత్ లో కూడా ఈ కంపెనీ తన ఔషధాలను విక్రయిస్తుందని స్పెయిన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com