యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి ఆత్మహత్య
- August 29, 2019
యూఏఈ:అల్ అయిన్ లో నిజామాబాదు జిల్లా వాసి రామసరం హరీష్, NCTH కంపెనీ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు,ఇతడు యూఏఈ వచ్చి నాలుగు నెలలు అవుతుంది, డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లడం తో దుబాయ్ లో ఉన్న ఏముల రమేష్ (అధ్యక్షులు -ప్రవాస హక్కులు) మరియు సంక్షేమ వేదిక -దుబాయ్ సభ్యులతో మాట్లాడి తొందరగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి ఏర్పాట్లు చేయమని కోరారు.రమేష్ కంపెనీ ప్రతినిధులతో మరియు ఇండియన్ కాన్సులెట్ అధికారులతో ,తెలంగాణ NRI సెల్ అధికారులతో సంప్రదించడంతో అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయడంతో ,ఈరోజు మృతదేహాన్ని ఎయిర్ ఇతిహాద్ ఫ్లైట్ లో ఇండియాకు బయలుదేరుతుంది.రేపు ఉదయం వరకు ఇంటికి చేరుతుంది,ప్రతి రోజు ఈవిషయం పైన ఇండియా నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహం నాయుడు సలహాలు ఇస్తూ మృతదేహం తొందరగా రావడానికి సహకరించారు.అట్లాగే దీనికి ఆ కంపెనీ HR ఆఫీసర్ అజిత మరియు మృతుడి బంధువు ఒడ్డెన్న,అజయ్ తెడ్డు(ఉపాధ్యక్షులు -ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక -దుబాయ్),బండి జగన్(ప్రధాన కార్యదర్శి),అరుణ్ కుమార్ సురునిదా(వర్కింగ్ ప్రెసిడెంట్),మహిపాల్ తలారి కార్యవర్గ సభ్యులు ,జనగామ శ్రీనివాస్(అడ్వైసర్),తెలంగాణ NRI డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టి బాబు తదితరులు సహకరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు