ఎంబసీలో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రవాసీయులకు సూచన
- August 29, 2019
మస్కట్: ఒమన్‌లో భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ అవ్వాలనీ, తద్వారా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగేందుకు ఆస్కారమేర్పడుతుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా ఒమన్‌లో వుంటున్న భారతీయులు, అలాగే షార్ట్ టెర్మ్ విజిట్ కోసం ఒమన్‌కి వచ్చినవారు ఎంబసీతో రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది. ఎంబసీ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయ్యాక, భారత పౌరులు తమ పేరు, పాస్‌పోర్ట్ డిటెయిల్స్‌తోపాటు, ఇతర వివరాల్ని పొందుపర్చాల్సి వుంటుంది. షార్ట్ టెర్మ్ విజిటర్స్, పీరియడ్ ఆఫ్ స్టే వివరాలు తెలపాలి. ఎంబసీలో పౌరుల వివరాలు వుంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







