శభాష్ బుడ్డోడా.. చిన్నారి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
- August 29, 2019
సెలవుల తర్వాత స్కూల్‌కి వెళ్ళాలంటే చాలా మంది చిన్నారులకు ఇష్టం ఉండదు. వారిని తిరిగి స్కూల్‌కి పంపాలంటే మాత్రం తల్లిదండ్రులకు కత్తి మీద సామే. అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్లి షికార్లు చేసి ఆట, పాటలతో కాలక్షేపం చేసిన వారు ఒక్కసారిగా పాఠశాలకు వెళ్లాలనే సరికి సుముఖత చూపించరు. బడికి వెళ్ళే సమయం రాగానే ఏడుపు ముఖాలు పెడతారు. ఇలానే అమెరికాకు చెందిన కానర్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడు మారాం చేస్తూ క్లాస్‌కి వెళ్ళకుండా స్కూల్లోనే ఓ పక్కన నిలబడ్డాడు. పైగా చిన్నారికి ఆటిజం కూడా ఉంది. మూలకు కూర్చొని అలా బాధ పడుతున్న కానర్‌ను తోటి విద్యార్థి క్రిస్టియన్ మూరే ఆత్మీయంగా పలకరించాడు. అతడిని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకువెళ్లాడు.
ఈ సంఘటన గమనించిన క్రిస్టియన్ తల్లి తన కొడుకుని చూసి గర్వంగా ఫీలైంది. “నా కుమారుడిని చూసి నాకు గర్వంగా అనిపించింది. ఏడుస్తున్న చిన్నారిని తను ఓదార్చి స్కూల్లోకి తీసుకువెళ్లాడు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాడిది చాలా దయాగుణం. తన మెుదటి రోజును మంచి పనితో ప్రారంభించాడు” అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలాగే క్రిస్టియన్, కానర్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌గా అవుతోంది. బుడ్డోడిది ఎంత గొప్ప మనసంటూ నెటిజన్లు క్రిస్టియన్‌ను ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!