నేడు రాజధానిలో పవన్ పర్యటన
- August 30, 2019
అమరావతి:రాజధాని అమరావతిలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ని కలసి సమస్యను వివరించారు. రెండు రోజులు రాజధానిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని పవన్ రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలో బయలుదేరి నవులూరు, కృష్టాయపా లెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాలలో పర్యటించి రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. శనివారం రాజధానిలోని ఆయన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలతో ఇతర వర్గాలవారితో పవన్ సమావేశం ఏర్పాటు చేసి, రాజధాని ప్రాంత సమస్యలపై స్పందించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..