కువైట్‌ జైలులో విద్యుత్‌ సమస్య

- August 31, 2019 , by Maagulf
కువైట్‌ జైలులో విద్యుత్‌ సమస్య

కువైట్‌: కువైట్‌లోని సులైబియా జైలులో విద్యుత్‌ సమస్య తలెత్తింది. జైలుతోపాటు ఓ ప్రైవేట్‌ ఫోర్సెస్‌ బిల్డింగ్‌లో కూడా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ విషయమై తక్షణ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఎలక్ట్రిక్‌ జనరేటర్లు ఉపయోగించి సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ సెంటెన్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి చెందిన 12 భవనాలకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీల మధ్య ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆప్‌ ఎలక్ట్రిసిటీ అండర్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌కి మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనపై వెంటనే సమస్య తలెత్తిన విభాగాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com