కువైట్‌లో పెరిగిన రెసిడెన్స్‌ ఉల్లంఘనులు

- August 31, 2019 , by Maagulf
కువైట్‌లో పెరిగిన రెసిడెన్స్‌ ఉల్లంఘనులు

కువైట్‌: రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనల్ని తగ్గించేందుకు ఎంతలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఏప్రిల్‌ 2018 నాటి గణాంకాలతో పోల్చుకుంటే తాజా లెక్కల ప్రకారం 7 శాతం ఉల్లంఘనలు అధికంగా చోటు చేసుకున్నాయి. గతంలో 107,700 ఉల్లంఘనలు నమోదైతే, ఇప్పుడవి 115,000గా నమోదయ్యాయి. కాగా, ఉల్లంఘనల్ని తగ్గించేందుకోసం 2018లో అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య 58,000కు తగ్గిందనీ, అయితే ఆ తర్వాత మళ్ళీ పెరిగిందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com