టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం
- September 01, 2019
అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగ విప్పింది. టెక్సాస్ కాల్పులతో ఉలిక్కిపడింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. వెంటనే నిందితున్ని చుట్టుముట్టిన పోలీసులు.. అతన్ని మట్టుబెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టారు.
బాధితులు ఒడెస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ముందుగా బైక్‌పై వచ్చాడు. అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక ట్రక్కును హైజాక్ చేసి.. అందులో నుంచే జనాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







