రాహుల్ కి షాకిచ్చిన అభిమాని...
- September 01, 2019
ఎవరైనా అభిమాన నాయకులు ఎదురైతే ఏం చేస్తాం. షేక్‌హ్యాండ్ లేదా ఓ హగ్ కానీ ఇస్తాం. అయితే రాహుల్ గాంధీకి ఓ అభిమాని నుంచి వింత అనుభవం ఎదురయ్యింది. రాహుల్ వయనాడ్ నియోజకవర్గ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్పీజీ లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రాహుల్ గాంధీకి ఓ అభిమాని ముద్దు పెట్టాడు. వయనాడ్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ అభిమాని రాహుల్ వాహనం దగ్గరకు వచ్చి ముందుగా షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఉన్నట్టుండి రాహుల్ చేయి పట్టుకుని లాగి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన రాహుల్ తర్వాత తేరుకుని తన పర్యటనను కొనసాగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ రాహుల్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. గుజరాత్‌లో పర్యటించినప్పుడు ఓ మహిళ అతడిని ముద్దు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో అప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







