బ్రేకింగ్: తెలంగాణకు మహిళా గవర్నర్
- September 01, 2019
తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌రాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న నరసింహాసన్ 2014లో రాష్ట్రం విడిపోయినా అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణకు కూడా ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహాన్ సుదీర్ఘకాలంగా ఉన్నారు.
రాష్ట్రం విడిపోయినా విభజన సమస్యల మీద ఆయనకు ఉన్న సంపూర్ణమైన అవగాహన నేపథ్యంలో కేంద్రం ఆయన్నే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగించింది. ముందుగా యూపీఏ -2 ప్రభుత్వంలో ఆయన గవర్నర్‌గా ఉన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం నరసింహాన్‌ను మాత్రం తెలంగాణకే కంటిన్యూ చేసింది. ఇక ఇప్పుడు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించింది.
ఇక రెండు రోజుల క్రితమే నరసింహాన్ తన బదిలీపై అన్యాపదేశంగా మాట్లాడారు. తనకు త్వరలోనే బదిలీ తప్పదన్న విషయాన్ని సైతం ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కొద్ది రోజులుగా నరసింహాన్‌ను బదిలీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై మరింత పట్టుకోసం కేంద్రంలోని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమ పార్టీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సౌందర్ రాజన్‌ను నియమించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా సౌందర్ రాజన్ నిమయితులు అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్రం మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.
తెలంగాణకు తమిళిసై సౌందర్‌రాజన్, హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజస్తాన్‌కు కల్‌రాజ్ మిశ్రా, మహారాష్ట్రకు భగత్‌సింగ్, కేరళకు మహ్మద్ ఖాన్ కొత్త గవర్నర్లుగా నియమితులుఅయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







