సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
- September 01, 2019
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహించారని, బాధితులను ఆదుకునేదుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా వినతి చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం చేయడాన్ని...బాధితులు ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాల ప్రజల దుస్థితి తనను కలచివేసిందన్నారు. అరటి, పసుపు, కంద, తమలపాకు, మొక్కజొన్న... వరి, చెరకు పంటలు మునిగిపోయాయని, ఇళ్లు దెబ్బతిన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులను వెంటనే ఆదుకోవాలని, లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. గోదావరి వరదల కారణంగా నష్టం అంచనాలను...త్వరితగతిన పూర్తిచేసి కేంద్రానికి పంపాలన్నారు. రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో టీడీపీ నిర్మించిన రక్షణగోడను త్వరగా పూర్తిచేయాలన్నారు. వరదలో నష్టపోయినవారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న మాన్యువల్స్‌ను అధ్యయనం చేయాలన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!