క్రికెటర్ మహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్
- September 02, 2019వెస్టిండీస్ తో ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్న టీమిండియా బౌలర్ షమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసులో షమీకి అతని సోదరుడు హసీద్ అహ్మద్‌కు వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలంటూ ఆదేశించింది.
పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్త, అతడి కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారంటూ షమీ భార్య హసీన్ జహాన్ కేసు పెట్టగా.. గతేడాది ఐపీఎల్‌కు ముందు ఈ వార్త హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు షమీపై గృహహింస కేసు పెట్టి చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే షమీ ఇంటికి వెళ్లిన జహాన్..అత్తారింట్లో హంగామా చేసి, షమీ తల్లిదండ్రులతో గొడవ పడింది. కూతురితో కలిసి వచ్చిన హసీన్ తనను తాను ఒక గదిలో నిర్భంధించుకోగా.. షమీ తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకుని వెళ్లి తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె షీమీ, అతని కుటుంబంపై పెట్టిన కేసులో విచారణ జరిపిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..