భారీగా తగ్గిన బంగారం ధర...
- September 07, 2019శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. ఆభరణాల తయారీ దారులనుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం బంగారం రేటు దగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అన్నారు. బంగారంలో పెట్టుబడులు బలహీనంగా మారడాన్ని కూడా మరో కారణంగా చెబుతున్నారు. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.372 తగ్గి రూ.39,278కి చేరింది. ఇదిలా వుంటే, మరోపక్క వెండి ధర కూడా రూ. 1,273 తగ్గి కిలో రూ.49,187కు చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,510 డాలర్లు పలికింది. ఇక వెండి ధర విషయానికి వస్తే అది కూడా భారీగా తగ్గి ఔన్సు18.30 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్