ఘనా దేశంలో గణపతి ఉత్సవాలు
- September 08, 2019
ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం ఆచారంగా వస్తుంటుంది. ఇండియాలో దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ వేడుకల కోసం దేశం ఆరు నెలలుగా సన్నాహాలు చేస్తుంటుంది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ వేడుకలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడికినుంకో వస్తుంటారు.
ఇలాంటి వేడుకలు మన దేశంలోనే కాదు.. భారతీయులు ఎక్కువుగా ఉండే ఫిజి దేశంలో కూడా భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఫిజిలో 48% భారతీయులు ఉన్నారు. అక్కడ ప్రభుత్వంలో చలామంది భారతీయ మంత్రులు కూడా ఉన్నారు. ఫిజిలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు ఉన్నారు. వారంతా ఇండియాలో జరిగే పండుగలను అక్కడ కూడా చేసుకుంటూ వస్తుంటారు.
అయితే, చాలా దేశాల్లో భారతీయులు పండుగలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వరు. కానీ, ఆఫ్రికాలోని ఘనా దేశంలో భారతీయ పండగైనా వినాయక చవితిని భారీ ఎత్తున చేస్తారు. వినాయక చవితిని ఆఫ్రికా స్టైల్ లో నిర్వహిస్తుంటారు. ఘానాలోని అక్రలో వేడుకలు బాగా జరుగుతుంటాయి. అక్రలో 12 వేలమందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరు ఆ దేశంలో ప్రతిఏటా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు అంగరంగవైభవంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆఫ్రికా స్టైల్ లో వాయిద్యాలు వాయిస్తూ.. ఊరేగింపుగా గణపయ్యను తీసుకెళ్లి సముద్రంలో నిమర్జనం చేస్తుంటారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు దాదాపుగా 50 ఏళ్లుగా వస్తున్నది. భారతీయులు జరుపుకునే ఈ వేడుకలో అక్కడి యువత, ఘానా నాయకులు కూడా పాల్గొంటుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ జరుగుతుంది. ఒక్క గణపతి ఉత్సవాలు కాదు. ఇండియాలో జరిగే ప్రతి పండుగను అక్కడ నిర్వహిస్తారని భారతీయులు చెప్తున్నారు. గణపతి ఉత్సవం తరువాత శ్రీకృష్ణాష్టమి, దీపావళిని బాగా చేస్తారట.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు