వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టిస్టారర్ సినిమా
- September 08, 2019
రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టిస్టారర్ తెరకెక్కుతోంది. వెంకీ మామ పేరుతో బాబి డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇధ్దరు హీరోలు ఉన్నారు కాబట్టి, నిర్మాత సురేష్ బాబు కాస్త ఎక్కువే ఖర్చు పెడుతున్నాడని తెలుస్తోంది. ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జోడీగా రాశీఖన్నా నటిస్తోంది.
వెంకీమామ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ దీనికి రెండు రోజుల ముందు చిరంజీవి సైరా వస్తుంది. అందుకే పోటీ పడటం ఇష్టం లేక, నిర్మాత సురేష్ బాబు వెంకీమామని అక్టోబర్ 25కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంటే అది దీపావళి సీజన్. కాబట్టి వీకెండ్ తో పాటు పండగ హడావిడి కూడా కలిసొస్తుందనే ఈ డెసిషన్ తీసుకున్నారు. లొకేషన్లు, సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వెంకీమామకి దాదాపు 50 కోట్లు వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మొత్తంగా వెంకీమామపై టాలీవుడ్లో అంచనాలతే బాగానే ఉన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







