'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్
- September 12, 2019సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండగే చిత్రం ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రముఖ నటుడు సత్యరాజ్ , సాయిధరమ్ తేజ్ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న లుక్ సినిమాపై మంచి అనుభూతి కలిగించే విధంగా ఉంది.
తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుప్రీం తర్వాత రాశి ఖన్నా మరోసారి సాయిధరమ్ తేజ్ తో రొమాన్స్ చేస్తోంది. డిసెంబర్ లో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రింద వీడియోలో మోషన్ పోస్టర్ చూడొచ్చు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం