ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
- September 12, 2019
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా [email protected] కు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?