పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత : భారత్ - చైనా సైనికుల ఘర్షణ

- September 12, 2019 , by Maagulf
పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత : భారత్ - చైనా సైనికుల ఘర్షణ

 

 

ఉత్తర పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ - చైనా సైనికులు పరసర్పం తలపడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. చర్చలతో ఉద్రిక్తతలకు తెరపడింది. భారత సైన్యం గస్తీ నిర్వహించడంపై పీఎల్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

టిబెట్ - లద్దాఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉంది. 134 కిలోమీటర్లు ఉంటుంది ఈ సరస్సు. మూడొంతుల భాగం చైనా ఆధీనంలో ఉంది. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం భారత సైన్యం ఇక్కడ గస్తీ నిర్వహించింది. PLO అభ్యంతరంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సైనికులు పరస్పరం తలపడుతూ..తోపులాటకు దిగారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. సాయంత్రానికి ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల సైన్యం ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరపడంతో ఇక్కడ ఉద్రిక్తత సమసిపోయింది. గతంలో 2017లోనూ భారత్ - చైనా సైన్యాలు తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం సైనికులు కొట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com