ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్‌ దిర్హామ్‌ జరీమానా

- September 13, 2019 , by Maagulf
ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్‌ దిర్హామ్‌ జరీమానా

యూఏఈ: ప్రభుత్వ బిజినెస్‌ ఫెసిలిటీ నుంచి కాన్ఫిడెన్షియల్‌ డేటాని దొంగిలించాడన్న ఆరోపణల నేపథ్యంలో పబ్లిక్‌ ఎంప్లాయీ ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడికి 1 మిలియన్‌ దిర్హామ్‌ల జరీమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్‌ చేయనున్నారు. నిందితుడు యూరోపియన్‌ వలసదారుడిగా పేర్కొన్నారు అధికారులు. విలువైన సమాచారాన్ని కంప్యూటర్‌ నుంచి తస్కరించి, దాన్ని ఇ-మెయిల్‌ రూపంలో తన సన్నిహితులకు పంపినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. తొలుత అంతర్గత విచారణ అనంతరం, నిందితుడ్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com