రూపాయి ఇడ్లీ బామ్మ
- September 13, 2019
తమిళనాడు:ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్‌కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి.ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. 10 రూపాయలతో 10 ఇడ్లీలు తిని కడుపునింపుకోవచ్చు. ఈ బామ్మ నిస్వార్ధ సేవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇడ్లీ బామ్మను అభినందించకుండా ఉండలేకపోయారు.
కమలాతాళ్.. కోయంబత్తూరులో ఈ పేరు తెలియని వారుండరేమో. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రేమతో తయారు చేసిన ఇడ్లీ, ఆప్యాయత కలిపిన చట్నీ, ఘుమఘుమలాడే సాంబార్.. ఇవే కమలాతాళ్ హోటల్ స్పెషల్. అందుకే కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా జనం కమలాతాళ్ హోటల్‌పై వాలిపోతారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!