ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు..

- September 13, 2019 , by Maagulf
ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు..

ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల వర్షం కురిపించనుంది. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంగా ‘బిగ్ బిలియన్ డేస్‌’ను ఆరు రోజుల పాటు ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ డిస్కౌంట్ సేల్ కొనసాగనుంది. ఇంకా ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులకోసం సెప్టెంబర్ 28,29తేదీల్లో రాత్రి 8 గంటలకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో రూ.49 నుంచే ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి.

ఆఫర్‌లో వున్న వస్తువుల జాబితా.. టీవీలు, గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, స్మార్ట్ పరికరాలు, కిరాణా సామాన్లు. ఇంకా టెక్ ప్రియుల కోసం మొబైల్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, వాటికి సంబంధించిన పరికరాలు ఈ సేల్‌లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ప్లస్ ఉంటే ఈ ఆఫర్ మరింత ప్లస్ కానుంది. వీరి కోసం నాలుగు గంటల ముందే సేల్ ప్రారంభం అవుతుంది.

దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, ఇంటి అలంకరణ ఉత్పత్తులపై అదనంగా 20 శాతం తగ్గింపు.. ప్రతి గంటకు ఒక కొత్త డీల్, ఒక ప్లాష్ సేల్ ఉంది. అర్థరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అదనపు డిస్కౌంట్లు ఉంటాయి. గృహసంబంధిత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. 36 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్‌పై మరిన్ని ఆఫర్లు కూడా అందించనుంది. ఈ సేల్ లో 1,000కి పైగా బ్రాండ్లకు చెందిన 20 లక్షలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇక దుస్తుల విషయానికి వస్తే అత్యధికంగా 90 శాతం వరకు తగ్గింపు ఉండనున్నట్లు పేర్కొంది సంస్థ. సౌందర్య సాధనాలు, బొమ్మలు, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు రూ.49 నుంచే ప్రారంభం కానున్నాయి. వీటిపై సెప్టెంబర్ 29న అదనంగా 15 శాతం తగ్గింపు లభించనుంది.

సేల్‌లో భాగంగా గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి ఉత్పత్తులపై ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్‌స్టాలేషన్ని అందించనుంది వినియోగదారులకోసం. వీటికి సంబంధించి 5 వేలకు పైగా బ్రాండ్లు, 5 లక్షలకు పైగా ఉత్పత్తులు ఉండనున్నాయి. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ ప్లైట్ బుకింగ్స్ చేసుకునే వారికి రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. బుకింగ్ సమయంలో సూపర్ కాయిన్లు ఉపయోగించడం ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఇక కాంబో డీల్స్‌పై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. మూడు ఉత్పత్తులు కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం, నాలుగు ఉత్పత్తులు కొంటే 20శాతం డిస్కౌంట్ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com