ఏపీలో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి?: పవన్‌

- September 14, 2019 , by Maagulf
ఏపీలో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి?: పవన్‌

అమరావతి: ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ తీరుపై విమర్శనాస్త్రాలు విసిరారు. ‘ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామంటున్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గాలి కదా?. ఈ మూడు నెలల్లో బీర్ల అమ్మకం 13శాతం ఎలా పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధంపై నమ్మకం లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. రైతుల విత్తనాల గురించి మాట్లాడిన ఆయన.. విత్తనాలు ఇవ్వడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఏపీలో పంచాల్సిన విత్తనాలు... మహారాష్ట్రలో తేలాయన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com