హైపర్ సోనిక్ స్లైడ్ ఆవిష్కరించిన అమెరికా
- September 14, 2019
అమెరికా:టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో అగ్రరాజ్యం దూసుకుపోతోంది. తాజాగా అమెరికా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ స్లైడ్‌ను రూపొందించింది. ఈ స్లైడ్‌ను న్యూమెక్సికోలో విజయవంతంగా పరీక్షించారు. హాలోమ్యాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో 10 మైళ్ల పొడవు ఉన్న ట్రాక్‌పై ఈ పరీక్ష జరిగింది.
హైపర్ సోనిక్ తయారీలో రష్యా, చైనాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి అమెరికా రక్షణ విభాగం కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గంటకు 6,599 మైళ్ల వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ స్లైడ్‌ను తయారు చేసింది. రైలు పట్టాలపై దూసుకెళ్లే ఈ స్లైడ్, గంటకు 10 వేల 620 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇక, హాలోమ్యాన్ బేస్‌ను 1949 నుంచి మిలటరీ ప్రయోగాలు, పరీక్షల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో మిలటరీపై అత్యధికంగా ఖర్చు పెట్టేది అమెరికాయే. ఆర్మీ కోసం గత సంవత్సరం బడ్జెట్‌లో ఏకంగా 46 లక్షల కోట్లు కేటాయించారు.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం