భారత్ అమ్ములపొది కి చేరిన స్పైస్ 2000 ఇజ్రాయెల్ బాంబులు
- September 16, 2019
భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఈ సరికొత్త బాంబులకు భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వాయుసేన పాకిస్థాన్ దేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







