శకుంతలాదేవిగా 'విద్యాబాలన్'
- September 16, 2019బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కనుంది. నేడు లండన్ లో మ్యాథమెటికల్ జీనియస్ `శకుంతలాదేవి` బయోపిక్ ప్రారంభమైంది. ఇందులో టైటిల్ పాత్రలో నటి విద్యాబాలన్ నటిస్తుంది. ప్రారంభోత్సవం సందర్భంగా బాలన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడింది. "ఈ కొద్ది నెలల గ్యాప్ లో నా గురించి నేను తెలుసుకున్నా. మ్యాథ్స్ లో ఇంత గొప్ప మేధావి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు ఎలా వచ్చిందో తెలుసుకున్నా. ఆ తర్వాత ఆ పాత్రపై మక్కువ పెరిగింది. ఈ కథను ఇష్టపడడానికి కారణం పాత్ర స్వభావం. అయస్కాంతం లాంటి ఆకర్షణ కలిగి ఉన్న పాత్ర ఇది. తన జీవితం ఎంత ప్రభావవంతమైంది అన్నది ఆకర్షించింది అని బాలన్ పేర్కొంది. `శకుంతలా దేవి` ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్ బాబ్డ్ హెయిర్ స్టైల్.. ఎరుపు రంగు చీరలో శకుంతలా దేవిగా విద్యా చాలా అందంగా కనిపించింది. మహిళా దర్శకురాలు అను మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ