రికార్డుల వేటలో 'సైరా'
- September 19, 2019మెగాస్టార్ చిరంజీవి రికార్డుల వేట మొదలైంది. నిన్న రిలీజైన చిరంజీవి సినిమా సైరా ధియేట్రికల్ ట్రైలర్ కి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ నిన్న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రిలీజైంది. తెలుగుతో పాటు సినిమా రిలీజ్ అవుతున్న తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో సైరా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద సైరా ట్రైలర్ కి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కేవలం 24 గంటల్లో సైరా ట్రైలర్ కి అన్ని బాషల్లో కలిపి 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
చిరంజీవి కెరీర్లో ఇదొక రికార్డ్. టాప్ లిస్ట్ లోనూ తెలుగులో మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది ఈ రికార్డ్. దీని బట్టే సైరా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి వచ్చినంతగా, హిందీ ట్రైలర్ కి కూడా దాదాపు అంతే రెస్పాన్స్ రావడం హైలైట్ గా చెప్పాలి. ఇక తమిళ, కన్నడ వెర్షన్ల ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో మాత్రం ఫరవాలేదనిపిస్తోంది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్ చూస్తే…అక్టోబర్ 2న వస్తున్న సినిమాకి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయో అని ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. ఇక ట్రైలర్ లో చూపించిన ఇంటెన్స్, యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్…సైరాపై అంచనాలు పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల