హ్యూస్టన్:భారీ వర్షం కారణంగా 'హౌడీ-మోదీ' సభ రద్దు అయ్యే అవకాశం
- September 20, 2019
అమెరికా:ఈ నెల 22న 'హౌడీ-మోదీ' పేరుతో టెక్సాస్‌లో నిర్వహిస్తున్న భారీ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి 50వేలకు పైగా ఎన్నారైలు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరవుతుండడంతో ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉంటే ఉష్ణమండల తుఫాను వల్ల టెక్సాస్‌లో గురువారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వరద నీరు పొటెత్తడంతో పూర్తిగా జలమయమైనట్లు సమాచారం. దీంతో టెక్సాస్‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ జార్జ్ అబ్బాట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆగ్నేయ టెక్సాస్‌లోని 13 కౌంటీల్లో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు 'హౌడీ-మోదీ' సభకు ఆటంకంగా మారే అవకాశం ఉందని నిర్వాహకులు భయపడుతున్నారు. దాదాపు 1,500 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రధాన నిర్వాహకుడు అచలేష్ అమర్ పేర్కొన్నారు. హ్యూస్టన్‌లో భారీ వర్షాల నేపథ్యంలో తాము గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







