తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణా శిబిరం

- September 21, 2019 , by Maagulf
తెలంగాణ జాగృతి  ఖతార్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణా శిబిరం

దోహా:తెలంగాణ జాగృతి  ఖతార్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం దోహలో 19 సెప్టెంబర్న  శిక్షణా శిబిరం జరిగింది. 

తెలంగాణ జాగృతి ఖతార్ ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న ఆధ్వర్యంలో షీన్ సర్వీసెస్ వారి సమర్పణ లో మరియు ఇండో ఖతార్ జాబ్స్ వారి సహకారంతో  జరిగిన ఈ శిబిరానికి ప్రఖ్యాత బహుళ జాతీయ సంస్థ క్యాప్ జెమిని మానవ వనరుల డైరెక్టర్ సజ్జాద్ అహ్మ ద్ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ యువత కు కావలసిన నైపుణ్య అభివృద్ధి పై పలు సూచనలు చేశారు.

సజ్జాద్ మాట్లాడుతూ.. దేశ యువత , ప్రత్యేకంగా పొట్ట కూటి కై పరాయి దేశాల బాట పట్టిన వారి కోసం నైపుణ్యం ఎంత ముఖ్యమో వివరించారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యం లేనిదే చేస్తున్న వృత్తి లో తట్టుకోవడం ఎంత కష్టమో వివరించారు. 

భారతదేశంలో మానవ వనరులకు లోటు లేదు. వారిలో 65 శాతం మంది 35 సంవత్సరాల లోపు ఉన్న యువకులే. అందులో 62 శాతం మంది 15 నుంచి వయసులో ఉన్న శ్రామిక శక్తి ఉంది. ఏటా కోటి మందికి పైగా పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధి ఏ దేశానికైనా చోదక శక్తులని. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సాగుతున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులు అత్యంత ఆవశ్యకం అని దీనితో పాటు సమానమైన అభివృద్ధి, అవకాశాలను అందిస్తూ పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించడం కూడా ముఖ్యమే అన్నారు. 

నైపణ్యాభివృద్ధి  ద్వారా వలసలు తగ్గుతాయని, అదే విధంగా వలస వచ్చిన మన దేశ పౌరులు ఇతర ప్రజల కన్నా ఎక్కువ వేతనాలు పొందవచ్చన్నారు. గల్ఫ్ లో ఫిలిప్పీన్స్,  నేపాల్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక  దేశాల నుండి పోటీ ఎదురవుతున్న క్రమంలో  మన దేశ పౌరులకు ఇది అత్యవసరం అన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న వారితో పాటు, కొత్త ప్రవేశించే వారికి సైతం నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు.

అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఈ మార్పులో భాగస్వాములు కావలసిందిగా యువతకు పిలుపునిచ్చారు.తెలంగాణా జాగృతి ఖతార్ కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య తాల్లపెళ్లి , సాయిగిరి వంశీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో షీన్ సర్వీసెస్ అధినేత లూత్ ఫి అహ్మెద్ మరియు ఆశ్ఫక్ ఆమేర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com