యూఏఈ: తొలి ఫ్రీ ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌ని ప్రారంభించిన ఎటిసలాట్‌

- September 22, 2019 , by Maagulf
యూఏఈ: తొలి ఫ్రీ ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌ని ప్రారంభించిన ఎటిసలాట్‌

యూఏఈ:'అప్‌గ్రేడ్‌ ఎనీ టైమ్‌' ప్రోగ్రామ్‌ని ఎటిసలాట్‌ ఐఫోన్‌కి సంబంధించి తొలిసారిగా రీజియన్‌లో ప్రారంభించింది. పాత ఐఫోన్‌ని, కొత్త ఐఫోన్‌తో మార్చుకునేందుకు ఈ ప్రోగ్రామ్‌ వీలు కల్పిస్తుంది. 2016లో ఐఫోన్‌ ఫర్‌ లైఫ్‌ అనే కార్యక్రమాన్ని ఎటిసలాట్‌ ప్రారంభించింది. 18 నెలలు, 24 నెలల గడువుతో ఐ ఫోన్‌ కొనేవారికి, 12 నెలలు ముగిశాక కొత్త యాపిల్‌ స్మార్ట్‌ ఫోన్‌కి అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు అవకాశం కల్పించింది ఎటిసలాట్‌. సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమయిన ఈ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌ స్మార్ట్‌ పే ప్లాన్‌ ద్వారా పొందేందుకు వీలుంది. ఎటిసలాట్‌ చీఫ్‌ కన్స్యుమర్‌ ఆఫీసర్‌ ఖాలెద్‌ అలఖోలీ మాట్లాడుతూ, 90 రోజులకోసారి కొత్త ఐ ఫోన్స్‌కి అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com