జమ్మూలో గవర్నర్‌ పాలన...

- January 10, 2016 , by Maagulf
జమ్మూలో గవర్నర్‌ పాలన...

జమ్మూకాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ అకాల మరణంతో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన చోటు చేసుకుంది. మూడు రోజులపాటు సంతాప దినాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టేందుకు పీడీపీ అధ్యక్షురాలు, ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబుబా ముఫ్తీ నిరాకరించారు. దీంతో జమ్మూలో గవర్నర్‌ పాలన విధించారు. మెహబుబాకు మద్దతుపై బీజేపీ తర్జనభర్జనలు ........ అయితే.. మెహబుబా ముఫ్తీకి మద్దతివ్వాలా.. వద్దా అనే అంశంపై బీజేపీ నేతలు తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. అందుకే ఆమె సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆలస్యమయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు అధికారాన్ని చేపట్టేందుకు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా. బీజేపీ, పీడీపీకి లేఖలు రాసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజా పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. బాధ నుంచి మెహబుబా తేరుకోలేదంటున్న పార్టీ వర్గాలు ........ మరోవైపు తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషాదం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చంటున్నారు. అప్పటివరకు గవర్నర్‌ పాలన కొనసాగనుందని.. ఇందులో రాజ్యాంగ సంక్షోభం ఏమీ ఉండదంటున్నారు పీడీపీ నేతలు. మెహబుబాతో బీజేపీ నేత రాంమాధవ్‌ భేటీ ...... ఇక ఇప్పటికే మెహబుబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ భేటీ అయ్యారు. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమె రేపో, ఎల్లుండో పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఈమె పదవీ చేపడితే జమ్మూ కాశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇక మెహబుబాను పరామర్శించేందుకు సోనియాగాంధీ నేడు శ్రీనగర్‌ వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com