గుర్రంతో పాటు విమానం ఎక్కిన మహిళ ..
- September 22, 2019
అమెరికా:విమానంలో ప్రయాణం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంత మందికి విమానం ఎక్కడం ఓ కల. మరికొంత మందికి విమానం ఎక్కాలన్న వారి దగ్గర డబ్బులు ఉండవు. కానీ శ్రీమంతులకు మాత్రం విమానం ఎక్కటం చాలా ఈజీ. ఎక్కువ మంది వారితో పాటు పెంపుడు జంతువుల్ని కూడా విమానంలో తీసుకెళుతుంటారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటివి తీసుకెళుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా గుర్రంతో పాటు విమానం ఎక్కింది. అది చూసిన పాసింజర్స్ షాక్ అయ్యారు. ఏదో చిన్న చిన్న జంతువుల్ని విమానంలో తీసుకెళ్లటం చూశాం కానీ ఏకంగా గుర్రాన్ని తీసుకురావటమేంటని ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది.
అమెరికాలో చికాగో నుంచి నెబ్రస్కా నగరంలోని ఒమహాకు వెళ్లటానికి ఓ మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ఆ మహిళ తన పెంపుడు జంతువు గుర్రంతో పాటు విమానంలోకి ఎక్కి తన సీటులో కూర్చొంది. అది చూసి ప్రయాణీకులంతా ఆశ్చర్యపోయారు. నోరెళ్లబెట్టి మరి ఆమె వంకా.. గుర్రం పిల్ల వంకా చూస్తుండిపోయారు. ఇది ఫ్లిర్లీ నా ముద్దుల బుజ్జి గుర్రం పిల్ల అని తోటి పాసింజర్స్‌కు పరిచయం చేసింది మహిళ. పొట్టిగా క్యూట్‌గా ఉన్న ఆ గుర్రపు పిల్ల ఏమాత్రం అల్లరి చేయకుండా.. చక్కగా బుద్దిగా ఉంది. తన యజమానురాలి కాళ్ల వద్దే పడుకుని ప్రయాణం సాగించింది. అయితే క్యూట్‌గా ఉన్న ఆ గుర్రం పిల్ల వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
మనుషులకు ఎమోషనల్‌గా దగ్గరైన జంతువుల్ని విమానాల్లో తీసుకెళ్లవచ్చని అమెరికా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అయితే అలా తీసుకెళ్లే జంతువులకు సంబంధించిన వివరాలను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి అమెరికన్లు తమ పెంపుడు జంతువులతో చక్కగా విమానంలో చక్కర్లు కొట్టేస్తున్నారు. కాకపోతే విమానంలో పెద్ద పెద్ద జంతువులకు అనుమతిలేదు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!