వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌: దోహాకి అథ్లెట్స్‌ రాక మొదలు

- September 23, 2019 , by Maagulf
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌: దోహాకి అథ్లెట్స్‌ రాక మొదలు

ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (ఐఎఎఫ్‌) వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌ నేపథ్యంలో అథ్లెట్స్‌, స్పోర్ట్స్‌ అఫీషియల్స్‌ రావడం మొదలైంది. ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌ జరగబోతోంది. 209 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా అథ్లెట్స్‌ ఈ పోటీల్లో పాల్గొంటారు. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ఖతార్‌ అధికార యంత్రాంగం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ట్రాఫిక్‌, ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ యూనిట్స్‌, అథ్లెట్స్‌కి, వారి సహాయకులకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల కోసం వచ్చే అథ్లెట్స్‌ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను హమాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com