బతుకమ్మ చీరల పంపిణీలో సింహభాగం హైదరాబాద్ దే – మేయర్ బొంతు రామ్మోహన్
- September 24, 2019_1569323834.jpg)
హైదరాబాద్: 1 ఆడపడుచులను బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించేందుకు గాను ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంగళవారం మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎం.బి.సి ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ లతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ...దసరా కానుకగా ప్రభుత్వం ఆడుపడుచులందరికీ అందిస్తున్న బతుకమ్మ చీరల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిహేనున్నర లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నామని తెలిపారు. వందకు పైగా డిజైన్లలో నాణ్యమైన చీరలను సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించి రూపొందించామని తెలిపారు. కేవలం ఉప్పల్ నియోజకవర్గంలోనే లక్ష మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని అన్నారు. గొప్ప సంస్కృతిక వారసత్వ చరిత్ర తెలంగాణాకు ఉందని, ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన అనంతరమే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో రాష్ట్రంలోని కుల వృత్తుల మనుగడ ప్రమాదంలో పడిందని, ఈ నేపథ్యంలో నేత కార్మికులను ఆదుకునేందుకుగాను రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి కె.సి.ఆర్ ఆశయమని అన్నారు. దీనిలో భాగంగానే సమాజంలో సగభాగమైన మహిళలందరూ దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పింఛన్లు, రైతు బందు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ తదిరత విప్లవాత్మక పథకాలను అమలుచేసే ఏకైక ప్రభుత్వం మనదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, పావనిరెడ్డి, శాంతి శేఖర్, డిప్యూటి కమిషనర్ థశరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు బతుకమ్మ ఆటలతో సభను హుషారెత్తించారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట