సన్‌రైజ్‌ ఏపీ పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభo

- January 10, 2016 , by Maagulf
సన్‌రైజ్‌ ఏపీ పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభo

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠాత్మకంగాభావిస్తున్న సూర్యోందయాంధ్రప్రదేశ్‌(సన్‌రైజ్‌ ఏపీ) పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభమైంది. హార్బర్‌ పార్కులోని ఏపీఐఐసీ మైదానంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సర్కారు, సీఐఐ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జైట్లీ... ఏపీ పెవిలియన్‌ను పరిశీలించారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఐటీ, పోర్టులు, గనులు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పార్కులు తదితర రంగాల్లో ఆసక్తి చూపిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1500 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.  సదస్సు ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి, పీయూష్‌ గోయెల్‌, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనిల్‌అంబానీ, ఆది గోద్రెజ్‌, గ్రంథి మల్లికార్జునరావు, అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా ఎనిమిది ప్లీనరీ సదస్సులు ఉంటాయి. మరోమూడు అదనపు సదస్సులు ఉంటాయి. ఈ సదస్సుల్లో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), బ్రిక్స్‌ లాంటి ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. తొలిరోజు ఖసుస్థిర ప్రపంచ ఆర్థిక వ్యవస్థభాగస్వామ్యంగపై సదస్సుతో కార్యక్రమం మొదలవుతుంది. రెండోరోజు ప్లీనరీ సదస్సుల్లో ప్రభుత్వ ప్రతినిధులు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఖఆకర్షణీయ పట్టణ గృహాల నిర్మాణం, పారిశ్రామిక కారిడార్లుమౌలిక సదుపాయాలు, తయారీ, భారత్‌లో తయారీ (మేక్‌ఇన్‌ఇండియా), అంతర్జాతీయ ఆర్థిక ప్రణాళిక సుస్థిరత, వ్యాపార అనుకూల వాతావరణం, ఏకీకరణ ప్రాంతీయత అంశాలపై వివిధ రంగాల్లోని ప్రముఖులు మాట్లాడుతారు. చివరి రోజు మంగళవారం ఖప్రపంచ పనితీరులో మార్పులు, సుస్థిరతవనరుల సంరక్షణ, ఏపీ పర్యాటకంగ పై సదస్సులు ఉంటాయి. మధ్యాహ్నం 1 గంటకు ముగింపు సమావేశం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com