హైదరాబాద్:మాయలేడి కొత్త తరహా మోసం!
- September 25, 2019
హైదరాబాద్‌లో కొత్త తరహా మోసానికి తెరలేపింది ఓ సైబర్ లేడి. నగరంలోని పలు స్కూల్స్‌కి చెందిన అఫిషియల్ ఫేస్బుక్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి.. వాటిని మార్ఫింగ్ చేస్తోంది. ఆ తర్వాత ఆ ఫోటోలను బాధితులకు పంపి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోంది. తాను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఈ కిలాడీ .. ఫోటోలు తీసేస్తానంటూ డబ్బులు వసూలు చేసింది. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్లో దాదాపు 225కు పైగా స్కూళ్ల వివరాలు ఉన్నట్లు గుర్తించారు. ఉన్నత చదువులు చదివిన ఈ మాయలేడి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కినట్లు.. పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!