వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తి…
- September 26, 2019
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ చాంబర్‌లో వేణు మాధవ్ భౌతిక కాయాన్ని చిరంజీవి, మురళి మోహన్, రాజ శేఖర్, జీవిత, నాగబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వేణు మాధవ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కాలేయ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం వేణుమాధవ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







