హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మొహమ్మద్ అజారుద్దీన్
- September 27, 2019
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించారు. 147 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. పోటీగా నిలిచిన ప్రకాశ్ జైన్‌కు 73ఓట్లు మాత్రమే వచ్చాయి. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. వీటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. దిలీప్ కుమార్ 3ఓట్లతో ప్యానెల్ కూడా బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం అజారుద్దీన్‌కు బాగా కలిసొచ్చింది. అజారుద్దీన్ రెండో ఇన్నింగ్స్‌గా హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తులో సంబరాలు మొదలయ్యాయి. వైస్ ప్రెసిడెంట్‌గా కూడా అజారుద్దీన్ ప్యానెల్ అభ్యర్థే లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
తొలిసారి హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారి వీఎస్ ప్రశాంత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..