నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ!
- September 27, 2019
న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. 74వ ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్ కానుంది. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయంలో రాత్రి 8-9 గంటల మధ్య (భారతీయ కాలమానం) నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. 2014లో తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు మోదీ. ఇవాళ రెండోసారి ప్రసంగించనున్నారు. నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేవారి జాబితాలో నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీ తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారు. ఈ 74వ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలపై ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో వివరిస్తారు. పాకిస్తాన్ గడ్డ మీద నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని కూడా ప్రధాని ఐక్యరాజ్యసమితి సాక్షిగా హైలైట్ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దీనిపై పాకిస్తాన్ రాద్ధాంతం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ఏదో తప్పు చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రధాన మోదీ ఈ సమావేశాన్ని అద్భుతంగా వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..