ఫుజైరా లో అగ్ని ప్రమాదం: 3 కార్లు దగ్ధం

- September 28, 2019 , by Maagulf
ఫుజైరా లో అగ్ని ప్రమాదం: 3 కార్లు దగ్ధం

ఫుజైరా :పార్కింగ్‌ చేసిన మూడు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజారియాలోని అల్‌ మీల్‌ సబర్బ్‌ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకోగానే ఫుజారియా పోలీస్‌ విభాగం, సివిల్‌ డిఫెన్స్‌ ఫైర్‌ ఫైటర్స్‌ని సంఘటనా స్థలానికి పంపించింది. పోలీస్‌ పెట్రోల్స్‌, పారా మెడిక్స్‌ మరియు రెస్క్యూ టీమ్స్‌ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం తలెత్తలేదు. మంటల్ని ఆర్పివేసిన అనంతరం పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. వాహనాలు రెగ్యులర్‌గా చెక్‌ చేస్తూ వుండాలని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com