ఆర్టికల్- 370 రద్దుపై మరో ట్విస్ట్
- September 29, 2019
ఆర్టికల్-370 రద్దుపై మరో ట్విస్ట్. ఈ నిర్ణయంలో చట్టబద్దతను తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఆర్టికల్ 370 రద్దు న్యాయసమ్మతమో కాదో తేల్చడానికి ఐదుగురు సభ్యులతో రాజ్యాంగం ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలో ఈ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1 నుంచి రాజ్యాంగ ధర్మాసనం, ఆర్టికల్ 370పై రద్దుపై విచారణ జరపనుంది.
కేంద్రంలోని మోదీ సర్కారు ఆగస్టు నెలలో కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్టికల్-370ని రద్దు చేసింది. దాంతో పాటు జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్టోబర్ 31 నుంచి రెండు యూటీలో మనుగడలోకి రానున్నాయి.
కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాలను పరిష్కరించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట