సౌదీ రాజు అంగరక్షకుడి మృతి, ఏడుగురికి గాయాలు..వ్యక్తిగత కక్షలే కారణమన్న అధికార మీడియా

- September 30, 2019 , by Maagulf
సౌదీ రాజు అంగరక్షకుడి మృతి, ఏడుగురికి గాయాలు..వ్యక్తిగత కక్షలే కారణమన్న అధికార మీడియా

రియాద్‌: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఆదివారం జరిగిన ఒక ఘర్షణలో రాజు సల్మాన్‌ వ్యక్తిగత అంగరక్షకుడు మరణించాడని, మరో ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. అంగ రక్షకుడి మిత్రుడి ఇంటి మరమ్మతుల సందర్భంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘర్షణలో రాజుకు అత్యంత సన్నిహితుడైన అంగ రక్షకుడు జనరల్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ ఫాగమ్‌ మరణిం చారని పోలీసులను ఉటంకిస్తూ సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ (ఎస్‌పిఎ) ఒక వార్తా కథనంలో వివరించింది. జెడ్డానగరంలోని తన మిత్రుడి ఇంటికి ఫాగమ్‌ వచ్చినపుడు మమ్దూ అల్‌ ఆలీ కూడా అక్కడికి వచ్చారని, వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని ఈ కథనంలో వెల్లడించింది. ఆ వెంటనే ఆలీ బయటకు వెళ్లి తుపాకీతో తిరిగి వచ్చి ఫాగమ్‌పై కాల్పులు జరిపాడని, ఇందులో మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపింది. ఆ తరువాత తనను తాను కాల్చుకుని అతడు చనిపోయాడని, ఐదుగురు భద్రతా సిబ్బంది ఈ కాల్పుల్లో గాయపడ్డారని తెలిపింది.

వ్యక్తిగత కక్షలే కారణం: అధికార మీడియా
అయితే వ్యక్తిగత కక్షలే ఈ కాల్పుల ఘటనకు దారి తీసాయని ప్రభుత్వ టెలివిజన్‌ అల్‌ ఎక్బారియా తన కథనంలో వివరించింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఫాగమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించా మని పోలీసులు చెప్పారు. జనరల్‌ ఫాగం రాజుకు అత్యంత సన్నిహితుడైన అధికారిగా సౌదీ ప్రజలకు సుపరిచితుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com