రోడ్డు ప్రమాదం: స్టూడెంట్‌కి గాయాలు
- September 30, 2019
యూఏఈ: కల్బా ప్రాంతంలో రెండు స్కూల్ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఓ స్టూడెంట్‌కి గాయాలయ్యాయి. రెండు స్కూల్ బస్సులు, విద్యార్థుల్ని స్కూల్స్‌కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సులో 10 మంది స్టూడెంట్స్ వుండగా, మరో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. రోడ్డుని సరిగ్గా గమనించకుండా ఓ బస్ డ్రైవర్, ఇంటర్నల్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకు బస్సుని తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు, సంఘటనా స్థలానికి అంబులెన్స్, రెస్క్యూ యూనిట్స్, పెట్రోల్ మరియు ట్రాఫిక్ ఎక్స్‌పర్ట్‌లను పంపించడం జరిగింది. గాయపడ్డ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల్ని స్కూల్స్‌కి పంపించడం జరిగింది. బస్ డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..