రానా ఆరోగ్యం పై సర్వత్రా ఉత్కంఠ
- October 01, 2019
లీడర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దగ్గుపాటి వారి అబ్బాయి రానా నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. హీరోగా కంటిన్యూ అవుతూనే బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ లో విలన్ గా మెప్పించాడు. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే రానా అనారోగ్యానికి గురైయ్యడని ఆ మధ్య వార్తలు హల్ చల్ చేసాయి. అలాంటిదేమీ లేదని రానా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మరో సారి రానా ఆరోగ్యం పై వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం రానా లుకే. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో రానా ఒకడు. ఆరడుగుల ఒక్క ఇంచి ఎత్తు ఉన్న హీరోగా రానా ఇండియన్ టాలెస్ట్ హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు. అయితే రానా తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రానా బక్కచిక్కి ,బాగా బరువు తగ్గి కనిపించాడు. అసలు రానాకి ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు. రానా గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నాడని.. డాక్టర్ల సలహా మేరకు ఇలా బరువు తగ్గాడని తెలుస్తుంది. ఏది ఏమైనా రానా త్వరగా కోలుకొని తిరిగి పాత లుక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!